Patancheru: పటాన్‌చెరులో ఛట్ పూజ వేడుకలు – 50 వేల మందికి చెరుకు పంపిణీ

Patancheru: పటాన్‌చెరులో ఛట్ పూజ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 1:59 PM IST
Patancheru
X

Patancheru: పటాన్‌చెరులో ఛట్ పూజ వేడుకలు – 50 వేల మందికి చెరుకు పంపిణీ

పటాన్చెరు: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని శనివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, బొంత పల్లి, ఖాజీపల్లి, తదితర ప్రాంతాలలో నివసిస్తున్న 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకును సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సైతం తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

గత 20 సంవత్సరాలుగా పటాన్చెరు సాకి చెరువు కట్ట పైన ఛట్ పూజ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటేష్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్