Patancheru: గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 29 లక్షల పరిహారం
Patancheru: పటాన్‌చెరులో పరిశ్రమలో పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడు దానయ్య కుటుంబానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.29 లక్షల పరిహారం ఇప్పించారు.
Patancheru: గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 29 లక్షల పరిహారం
పటాన్చెరు: పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. యజమాన్యంతో చర్చించి నష్ట పరిహారం అందించి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జి. దానయ్య.. గత కొంతకాలంగా పాశమైలారం పారిశ్రామికవాడలోని ల్యాం టఫ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ.. కుటుంబంతో కలిసి స్థానికంగా జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన.. పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ.. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో చర్చించి.. మృతుడి కుటుంబానికి 29 లక్షల రూపాయలు నష్టపరిహారం మంజూరు చేయించారు.
మంగళవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్, వాసు తదితరులు పాల్గొన్నారు.




