Patancheru: తెల్లాపూర్, పాటిలో దుర్గా నిమజ్జనం ప్రారంభించిన ఎమ్మెల్యే
Patancheru: పటాన్చెరు పరిధిలోని తెల్లాపూర్, పాటి గ్రామాల్లో దుర్గామాత మండపాలను దర్శించుకుని నిమజ్జనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
Patancheru: తెల్లాపూర్, పాటిలో దుర్గా నిమజ్జనం ప్రారంభించిన ఎమ్మెల్యే
పటాన్చెరు: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, ముత్తంగి డివిజన్ల పరిధిలోని తెల్లాపూర్, పాటి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, సానుకూలతను నింపాలని కోరుకున్నారు.
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ, సంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.




