Patancheru: కేసీఆర్‌తో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ

Patancheru: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను హరీష్ రావుతో కలిసి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Oct 2026 6:21 PM IST
Patancheru
X

Patancheru: కేసీఆర్‌తో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ

పటాన్చెరు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సాయంత్రం ఎర్రవల్లి లోని కెసిఆర్ ఫామ్ హౌస్ లో.రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు తో కలిసి. కేసీఆర్ ని కలిశారు.

ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేసీఆర్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కెసిఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్