Patancheru: పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ మానసపుత్రిక కల్యాణ లక్ష్మి

Patancheru: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 160 మంది లబ్ధిదారులకు రూ.1.60 కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 5:15 PM IST
Patancheru
X

Patancheru: పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ మానసపుత్రిక కల్యాణ లక్ష్మి

పటాన్ చెరు: పేదింటి ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

శనివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు చెందిన 160 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన రూ.1,60,18,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహాల కోసం పేద కుటుంబాలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాల్లో వివాహ వేడుకలు సంతోషంగా జరిగేందుకు ఈ పథకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల తహశీల్దార్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్