Patancheru: పోలీసు అమరుల స్మరణలో పటాన్‌చెరు యువత రక్తదానం

Patancheru: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరు సీఐ రవీందర్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు సైబరాబాద్ సీపీ కార్యాలయంలో రక్తదానం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 6:11 PM IST
Patancheru
X

Patancheru: పోలీసు అమరుల స్మరణలో పటాన్‌చెరు యువత రక్తదానం

పటాన్‌చెరు: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పటాన్‌చెరు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహమ్మద్ ఆసిఫ్ నేతృత్వంలో యువకులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు.

ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, రక్తదానం ద్వారా ప్రాణదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్