Toopran: తూప్రాన్ 2BHK కాలనీలో పోలీసుల భారీ తనిఖీలు.. 64 వాహనాలు సీజ్!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ 2BHK కాలనీలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ తనిఖీలు జరిగాయి.
Toopran: తూప్రాన్ 2BHK కాలనీలో పోలీసుల భారీ తనిఖీలు.. 64 వాహనాలు సీజ్!
Toopran: మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతే లక్ష్యంగా తూప్రాన్ పట్టణంలోని 2BHK కాలనీలో ఈరోజు భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
105 మంది పోలీసు సిబ్బందితో 450 ఇళ్ల తనిఖీ
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపీఎస్, తూప్రాన్ DSP నరేందర్ గౌడ్,తూప్రాన్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్, నర్సాపూర్ CI రంగకృష్ణ, SIలు, CCS, SHE టీమ్స్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిపి 105 మంది పాల్గొని 450కి పైగా ఇళ్లను క్షుణ్ణంగా పోలిసలు తనిఖీ చేశారు.
64 వాహనాలు సీజ్
తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 3 త్రిచక్ర వాహనాలు - మొత్తం 64 వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు RC, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జాతీయ రహదారి పై ప్రమాదలాల ఎక్కువ గా యువత చనిపితున్నారని గుర్తు చేశారు హెల్మెట్ సిటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని నిబంధనలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోంటారని అదనపు ఎస్పీ సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు, కదలికలు, వాహనాలపై నిఘా ఉంచామని, కొత్త వ్యక్తులు, గుర్తు తెలియని వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని పోలీసులుఆయన తెలిపారు.
అవసరం ఉంటేనే 100 నంబర్ వాడాలని తప్పతాగి అనవసరంగా 100 తార్చు కాల్ చేస్తే వారిపై కెసులు నమోదు చేస్తాం అని ఆయన అన్నారు గంజాయి డరగ్స్. మద్యం ఆంఘిక కార్యక్రమలు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏమైన అమ్మకాలు జరిగితే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.




