Medak: మనోహరాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం!

Medak: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మనోహరాబాద్‌లో తలసేమియా చిన్నారుల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

RAJU,TOOPRAN
Published on: 28 Oct 2026 1:17 PM IST
Medak
X

Medak: మనోహరాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం!

Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయపడే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హాజరయ్యారు. రక్తదాతలను అభినందిస్తూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, పోలీసులు తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

ఈ శిబిరంలో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సిఐ వెంకట రాజా గౌడ్ ఎసైలు సుభాష్ గౌడ్ గంగరాజు మధుకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN