Sangareddy: తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి పోతిరెడ్డిపల్లి భక్తుల పాదయాత్ర!
Sangareddy: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన దేవి నవరాత్రి ఉత్సవ సమితి భక్త బృందం మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి 16వ సారి పాదయాత్రగా బయలుదేరింది.
Sangareddy: తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి పోతిరెడ్డిపల్లి భక్తుల పాదయాత్ర!
Sangareddy: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన దేవి నవరాత్రి ఉత్సవ సమితి హనుమాన్ ఆలయ భక్త బృందం మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి పాదయాత్రగా బయలుదేరింది. అమ్మవారిపై అపారమైన భక్తి, విశ్వాసంతో భక్తులు ఈ పాదయాత్రను చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. భవానీ మాత ఆశీస్సులతో ప్రతి సంవత్సరం పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 15 సార్లు పాదయాత్రగా తుల్జాపూర్ చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నామని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రతి సంవత్సరం పాదయాత్రను కొనసాగిస్తున్నామని భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ పాదయాత్రలో అశోక్ యాదవ్, సంగమేష్, వంశీ, రాజేష్, అభినవ్ తదితర భక్తులు పాల్గొన్నారు.




