Narsapur: నిబంధనల ప్రకారం మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో భారీగా గంజాయి, పాపిస్టా పౌడర్ ధ్వంసం. డ్రగ్ డిస్పోజల్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల చర్యలు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 17 Sept 2026 10:46 PM IST
Narsapur
X

Narsapur: నిబంధనల ప్రకారం మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ!

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెరిడీ బయోకెమికల్ లిమిటెడ్, కాగజ్‌మద్దు, అలాగే నర్సాపూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, పాపిస్టా పౌడర్‌ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేశారు.

డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మెదక్ డివిజన్ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ఎల్. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమం నిర్వహించారు.

వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, పాపిస్టా పౌడర్‌ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు సంబంధిత నిబంధనలను పాటిస్తూ డిస్పోజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా, అండర్ ట్రైనింగ్‌లో ఉన్న జ్ఞానేశ్వర్, సీఐ, ఎస్‌ఐ శరత్ కుమార్, రామాయణ్‌పేట్ సీఐ నరేంద్రరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

అధికారుల సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ ప్రక్రియను పూర్తి చేశారు. మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న పదార్థాలను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR