Sangareddy: సంగారెడ్డిలో జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత!
Sangareddy: సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతులకు రమేష్ పటేల్ దంపతులు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.
Sangareddy: సంగారెడ్డిలో జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత!
Sangareddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి దంపతులకు కాబోయే వియ్యంకుడు రమేష్ పటేల్ దంపతులు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌లో గల జగ్గారెడ్డి స్వగృహానికి విచ్చేసిన రమేష్ పటేల్ దంపతులు సంప్రదాయబద్ధంగా జగ్గారెడ్డి దంపతులను శాలువలతో సత్కరించి, స్వీట్లు అందజేసి వివాహానికి ఆహ్వానించారు.
జగ్గారెడ్డి, నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డి, రమేష్ పటేల్ దంపతుల కుమార్తె పాలక్ పటేల్ వివాహం ఈ నెల 25న సంగారెడ్డి పట్టణంలోని గంజ్ మైదాన్‌లో జరగనున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్‌తో పాటు జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, అల్లుడు గుణ చైతన్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




