Narsapur: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఆవుల రాజిరెడ్డి పిలుపు

Narsapur: ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాజిరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 15 Aug 2026 7:14 AM IST
Narsapur
X

Narsapur: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఆవుల రాజిరెడ్డి పిలుపు

Narsapur: ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్‌లో ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారని తెలిపారు. అనంతరం 2.30 గంటల నుంచి 3.35 గంటల వరకు జరిగే ప్రధాన బహిరంగ సభ, కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సంగారెడ్డిలో శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు.

నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంగారెడ్డి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story