Narsapur: నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్సులో సీట్ పంచాయతీ.. పీఎస్‌కు బస్సు
Narsapur: మెదక్ నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సులో మహిళపై వ్యక్తి దాడి, బ్యాగ్ చింపివేత. ప్రయాణికుల ఆందోళనతో బస్సును నర్సాపూర్ పీఎస్‌కు తరలింపు.
Narsapur: నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్సులో సీట్ పంచాయతీ.. పీఎస్‌కు బస్సు
నర్సాపూర్: మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడైన వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో మహిళపై దాడి చేసి, ఆమె బ్యాగును చింపివేయడంతో బస్సులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సును నేరుగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
Next Story




