Medak: మెదక్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె సన్నాహాలు
Medak: మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం. పీఆర్‌సీలు, విలీనం డిమాండ్లపై గేట్ మీటింగ్ నిర్వహించారు.
Medak
Medak: మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నాహాలు ప్రారంభించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్‌సీలను వెంటనే ప్రకటించాలని, యూనియన్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మికులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మెదక్ డిపో గ్యారేజ్ ఎదుట ఆర్టీసీ కార్మికులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎంయూ రాష్ట్ర నాయకుడు ఎంఆర్‌కే రావు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సమ్మెకు ముందు నిర్వహించిన ఈ గేట్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై తమ ఐక్యతను ప్రదర్శించారు.
Next Story




