Rudraram: రుద్రారంలో ఘనంగా దసరా వేడుకలు.. వైభవంగా రావణ దహనం

Rudraram: రుద్రారంలో ఘనంగా విజయదశమి వేడుకలు. మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా వైభవంగా నిర్వహించిన రావణ దహన వేడుకలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Oct 2026 10:17 PM IST
Rudraram
X

Rudraram: రుద్రారంలో ఘనంగా దసరా వేడుకలు.. వైభవంగా రావణ దహనం

రుద్రారం: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం వార్డులో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం దసరా పండుగ ఘనంగా వేడుకలు నిర్వహించారు. కౌన్సిలర్లు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆనవాయితీ ప్రకారం భక్తిశ్రద్ధలతో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అలనాటి సంప్రదాయాన్ని చాటిచెప్పారు.

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామంలో రావణ దహన కార్యక్రమం వైభవంగా చేపట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ రావణ దహన వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, మహిళలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు పాండు, లత వెంకట్, సందీప్ గౌడ్, వడ్డేగడ్డ రాజు, లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ.. రుద్రారం గ్రామం కొత్తగా మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత, మున్సిపాలిటీ పరిధిలో తొలిసారిగా ఈ రావణ దహన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారంతో భవిష్యత్తులోనూ ఇలాంటి సాంస్కృతిక, పండుగ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు మన్నే రాజు, హరిప్రసాద్ రెడ్డి, అలాగే పలువురు మాజీ వార్డు మాజీ ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్