Sadasivpet: డాక్టర్ ఇంద్ర జన్మదినం: 100 మందితో రక్తదాన శిబిరం!

Sadasivpet: సదాశివపేట పట్టణంలోని సాయిరాం ఆస్పత్రిలో డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

SRIKANTH, SANGAREDY
Published on: 11 Nov 2026 10:16 PM IST
Sadasivpet
X

Sadasivpet: డాక్టర్ ఇంద్ర జన్మదినం: 100 మందితో రక్తదాన శిబిరం!

సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని సాయిరాం హాస్పిటల్‌లో డాక్టర్ ఇంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించగా, సుమారు 100 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు అభినందించారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం సంతోష్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఇంద్రకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY