Sangareddy: సీఎం రేవంత్ సభకు భారీగా తరలివెళ్లిన సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు!

Sangareddy: సిద్దిపేటలో గురువారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సిపాలిటీల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

Srinivas K, Sangareddy
Published on: 19 Nov 2026 4:44 PM IST
Sangareddy
X

Sangareddy: సీఎం రేవంత్ సభకు భారీగా తరలివెళ్లిన సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు!

సంగారెడ్డి: సిద్దిపేటలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ శ్రేణులు సభకు బయలుదేరారు.

నియోజకవర్గవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ముందుగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ర్యాలీగా సిద్దిపేటకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఐబీ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా తరలివెళ్లాయి.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, అంకని ప్రవీణ్, సందీప్ రెడ్డి, వంశీ, రవి నాయక్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy