Sangareddy: సంగారెడ్డి మండలం కంది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Sangareddy: సంగారెడ్డి మండలం కంది సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా పడటంతో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం.

Srinivas K, Sangareddy
Published on: 3 Nov 2026 8:07 AM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి మండలం కంది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Sangareddy: అర్ధరాత్రి సుమారు 12:00 గంటల సమయంలో సంగారెడ్డి మండలం కంది గ్రామ పరిధిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో గజులగూడెం గ్రామం, శంకర్‌పల్లి మండలానికి చెందిన యెల్లకొండ నరసింహులు, తండ్రి దుర్గయ్య, వయస్సు 40 సంవత్సరాలు, కులం యాదవ్ మరియు అతని భార్య మౌనిక, వయస్సు 33 సంవత్సరాలు, ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే, మృతులు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు నంబర్ TS 07 HM 7749 శంకర్‌పల్లి నుండి సంగారెడ్డి వైపు వస్తుండగా, కంది గ్రామం వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడపడం వల్ల అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy