Jogipet: జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం!
Jogipet: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Jogipet: జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం!
జోగిపేట: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై మాజీ చైర్మన్ మటం భిక్షపతి తీవ్రంగా స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ గారు తక్షణమే ఈ ఘటనపై స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
"అందోల్ నియోజకవర్గం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని బాలికల వసతి గృహంలో నాణ్యత లేని ఆహారం విద్యార్థినుల పాలిట శాపంగా మారింది. హాస్టల్లో భోజనం చేసిన 15 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పేద విద్యార్థినులకు పౌష్టిక ఆహారం అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మాజీ చైర్మన్ మఠం భిక్షపతి మండిపడ్డారు. స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ గారు స్వయంగా వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిర్లక్ష్యానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో భోజన నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థినుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు."జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణమే స్పందించాలి.. 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం బాధాకరం.. బాధ్యులపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ చైర్మన్ మటం భిక్షపతి డిమాండ్ చేసారు.




