Sangareddy: జోగిపేటలో ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి: రూ.30 టికెట్ పంచాయితీ!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రూ.30 టికెట్ డబ్బుల గొడవతో ఆర్టీసీ బస్సుపై రాయి విసిరి అద్దం పగలగొట్టిన రేగోడ్ యువకుడిని ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

UMASHANKAR, ANDOLE
Published on: 10 Nov 2026 5:40 PM IST
Sangareddy
X

Sangareddy: జోగిపేటలో ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి: రూ.30 టికెట్ పంచాయితీ!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేవలం ముప్ఫై రూపాయల టికెట్ డబ్బుల గొడవ కాస్తా.. చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆర్టీసీ బస్సుపై ఓ యువకుడు కోపంతో రాయి విసిరి దాడి చేసిన ఘటన జోగిపేట పరిధిలో కలకలం రేపింది."

రేగోడ్ కు చెందిన ఒక యువకుడు జోగిపేట బస్ స్టాండ్‌లో నారాయణఖేడ్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే కండక్టర్ టికెట్ ఇచ్చే సమయంలో ఆ యువకుడి వద్ద ముప్ఫై రూపాయలు తక్కువగా ఉన్నట్లు తేలింది. దీనితో కండక్టర్, యువకుడి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నియమ నిబంధనల ప్రకారం డబ్బులు తక్కువగా ఉండటంతో.. కండక్టర్ ఆ బస్సును అన్నసాగర్ గ్రామ శివార్లలో ఆపి సదరు యువకుడిని కిందకు దింపేశారు."

కోపంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు.. బస్సు ముందుకు కదులుతున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాయిని తీసుకుని బస్సు వెనుక భాగంపై బలంగా విసిరాడు. ఈ దాడిలో బస్సు వెనుక వైపు ఉన్న అద్దం పూర్తిగా పగిలి ముక్కలైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు."

"వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేసి, కండక్టర్ మరియు తోటి ప్రయాణికుల సహాయంతో పారిపోతున్న ఆ యువకుడిని పట్టుకున్నారు. అనంతరం బస్సును తిరిగి జోగిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు గానూ సదరు యువకుడిపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జోగిపేట పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేవలం 30 రూపాయల కోసం ప్రభుత్వ ఆస్తిని పాడుచేసి, కెరీర్‌ను నాశనం చేసుకున్నాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు."

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE