Sangareddy: కంగ్టిలో దారుణం.. కౌలు రైతు 100 క్వింటాళ్ల సోయా పంట దగ్ధం!
Sangareddy: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగాంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కౌలు రైతు అశోక్‌కు చెందిన 100 క్వింటాళ్ల సోయా పంట దగ్ధమైంది.
Sangareddy: కంగ్టిలో దారుణం.. కౌలు రైతు 100 క్వింటాళ్ల సోయా పంట దగ్ధం!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగాంలో అర్ధ రాత్రి కౌలు రైతు అశోక్ కు చెందిన(8)ఎకరాల్లో పండించిన 100క్వింటాళ్ల..సొయా పంట కోసి కుప్ప నూడిసి పెట్టిన పంటను గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైందని రైతు అశోక్ వాపోయారు.
అప్పు చేసి పంట పండించి కోసి రాసి చేసే సమయంలోనే ఇలా దగ్ధం కావడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలని కౌలు ఎలా కట్టాలని అమ్ముకునే సమయంలో ఇలా జరగడంతో రైతు కన్నీరు అయ్యారు.




