Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వృథాగా పోతున్న సింగూరు జలాలు
Sangareddy: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలి వేలాది లీటర్ల మంజీరా నీరు వృథాగా పోతోంది.
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వృథాగా పోతున్న సింగూరు జలాలు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఒకవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో విలువైన సింగూరు జలాలు వృథాగా పోతున్నాయి. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామ సమీపంలో ప్రధాన మిషన్ భగీరథ పైప్లైన్కు భారీ లీకేజీ ఏర్పడింది. ఉదయం నుంచి వేలాది లీటర్ల మంజీరా నీరు వృథాగా ప్రవహిస్తోంది.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో గుక్కెడు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని ప్రధాన మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు ఎగజిమ్ముతోంది. ఉదయం నుంచి ఈ లీకేజీ కొనసాగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లీకేజీ కారణంగా ఇప్పటికే వేలాది లీటర్ల మంజీరా, సింగూరు జలాలు సమీపంలోని పొలాల్లోకి, కాలువల్లోకి వృథాగా వెళ్లిపోయాయి. పైప్లైన్ నిర్వహణలో అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరాకు అంతరాయం కలగకముందే, మరిన్ని నీళ్లు వృథా కాకముందే




