Sangareddy: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి: జయరాజు!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించి, రైస్ మిల్లులను ట్యాగ్ చేయాలని సివిల్ సప్లై డీఎం జయశ్రీ లాల్‌కు రైతు సంఘం వినతిపత్రం ఇచ్చింది.

Srinivas K, Sangareddy
Published on: 11 Nov 2026 11:31 PM IST
Sangareddy
X

Sangareddy: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి: జయరాజు!

సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలు పరిష్కరించాలి. కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్స్ కేటాయించాలి రైతు సంగం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రైతు సంగం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను కోరారు. నేడు రైతు సంగం ఆధ్వర్యంలో సివిల్ సప్లై డీ యం జయశ్రీ లాల్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న PACS, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్స్ కేటాయించాలని ప్రభుత్వంను కోరారు. కొనుగోలు కేంద్రాలలో గొనె సంచులు, హమాలీల సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలీనో నేపథ్యంలో రైతులకు నష్టం కల్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం రైతు సంగం జిల్లా కార్యదర్శి యస్.రమేష్ గౌడ్, నాయకులు విట్టల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy