Sangareddy: ఈత కోసం పిల్లలను ఒంటరిగా చెరువులకు పంపవద్దు!
Sangareddy: దసరా సెలవుల్లో పిల్లల భద్రత, నీటి ప్రమాదాల నివారణ మరియు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు.
Sangareddy: ఈత కోసం పిల్లలను ఒంటరిగా చెరువులకు పంపవద్దు!
Sangareddy: సంగారెడ్డి దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి రూలర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి విషాదం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పండుగ సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటలు, కాలువలు, బావులు, ఈత కొలనుల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని ఈతకు వెళ్లే సమయంలో పెద్దలు తప్పనిసరిగా తోడుండాలని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి దిగకుండా చూడాలని తెలిపారు.
పండుగల సందర్భంగా ప్రయాణాలు చేసేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ వ్యక్తిగత భద్రతకు, కుటుంబ సభ్యుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రజలకు ఎస్సై విజ్ఞప్తి చేశారు




