Sangareddy: కరువు బారిన పడిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి రైతు సంఘం!

Sangareddy: కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవాలని సంగారెడ్డిలో రైతు సంఘం డిమాండ్. పంట నష్టపరిహారం చెల్లించాలని, AIKS మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు.

Srinivas K, Sangareddy
Published on: 3 Nov 2026 8:04 AM IST
Sangareddy
X

Sangareddy: కరువు బారిన పడిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి రైతు సంఘం!

Sangareddy: కరువు బారిన పడిన రైతాంగం ఆదుకోవాలి. -నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు ఇవ్వాలి. -అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలను జయప్రదం చేయండి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ . ఈరోజు సంగారెడ్డి లోని సుందరయ్య భవన్లో జరిగిన రైతు సంఘం సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినప్పటికీ. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని.

కరువుతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఆహార పంటలకు 30000 వాణిజ్య పంటలకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని. రీ షెడ్యూల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేసి కరువు లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన అన్నారు. నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అఖిలభారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని. 15వ తేదీ లక్ష మంది రైతులతోజరిగే బహిరంగ సభను. జిల్లాలోని రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజు సహాయ కార్యదర్శి భూషణం జిల్లా కమిటీ సభ్యులు మాణిక్ రెడ్డి. యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy