Vatpalli: పంచాయతీ ట్రాక్టర్‌తో సర్పంచ్ నీటి దందా.. ఆరోపణలు
Vatpalli: మార్వెల్లి గ్రామంలో పంచాయతీ బోర్ల నీటిని ట్రాక్టర్ ద్వారా పాలిహౌస్‌కు తరలించి సర్పంచ్ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Vatpalli: పంచాయతీ ట్రాక్టర్‌తో సర్పంచ్ నీటి దందా.. ఆరోపణలు
వట్‌పల్లి: ఒకవైపు ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో సర్పంచ్ మాత్రం తన స్వార్థం చూసుకుంటున్నారు. గ్రామ భూగర్భ జలాలను కాపాడి ప్రజలకు నీరందించాల్సిన సర్పంచే స్వయంగా నీటి దందాకు తెరలేపారు.
గ్రామ బోర్ల సహాయంతో పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించి.. పాలిహౌస్‌కు అక్రమంగా నీటిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.సింగూరు జలాశయం అడుగంటిపోవడం, వర్షాలు లేక భూగర్భ జలాలు పూర్తిగా పడిపోతుండటంతో రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలిహౌస్‌లు, ఫామ్‌హౌస్‌లకు ప్రభుత్వ పంచాయతీ నీటిని తరలించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీ ఉన్నత అధికారులు వ్యవహారంలో జోక్యం చేసుకుని, అక్రమ నీటి దందాను వెంటనే అరికట్టాలని మార్వెల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




