Sangareddy: పోలీస్ ఫ్లాగ్ డే వేళ ఆన్‌లైన్ పోటీలు పాల్గొనాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

Sangareddy: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు ఆన్‌లైన్ వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Oct 2026 8:21 AM IST

Sangareddy: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు పోలీసు సేవలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు.

విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు

6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ మరియు ఆపై చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీల వ్యాసం 500 పదాలకు మించకూడదు.

6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అంశాలు సైబర్ నేరాల నివారణలో పోలీసుల, పౌరుల పాత్ర. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు ఎలా దూరంగా ఉండాలి? డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు అంశాలు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర.

ఆసక్తి గల విద్యార్థులు https://forms.gle/YkeKUscWu5LFYWFH7 ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, తమకు నచ్చిన భాషలో వ్యాసం రాసి, దానిని ఫొటో లేదా పిడిఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. చివరి తేదీ 28.10.2026.

ప్రజలకు షార్ట్ ఫిల్మ్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర పౌరులు పోలీసు సేవలు, ప్రజా భద్రత, నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, పోలీసు అమరవీరుల త్యాగాలు వంటి అంశాలపై గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించి సమర్పించాలి. జిల్లా స్థాయిలో ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. ఎంపికైన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఫొటోగ్రఫీ పోటీలు

కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజాసేవ, నేరాల నివారణ, పోలీసుల విధులు వంటి అంశాలకు సంబంధించిన ఇటీవలి ఫొటోలను పోటీలకు పంపవచ్చు. జిల్లా స్థాయిలో, అనంతరం రాష్ట్రస్థాయిలో ఫొటోలను ఎంపిక చేసి, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల వారు https://forms.gle/gVpPmmWFrWZNNRBF6 ఈ లింక్ ద్వారా షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ లు రూపంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. చివరి తేదీ 30.10.2026.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్