Sangareddy: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
Sangareddy: సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డీ-అడిక్షన్ సెంటర్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. బాధితులకు ఎస్-నాబ్ ద్వారా స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు.
Sangareddy: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని గడిపేలా పునరావాసం (రెహాబిలిటేషన్), కౌన్సెలింగ్ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో వారిలో మార్పు తీసుకురావడమే ఈ డీ-అడిక్షన్ సెంటర్ ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జీవితంలో మంచి మార్గంలో నడుస్తూ తమ కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నారు.
ఈ సందర్భంగా ఎస్-నాబ్ (S-NAB) ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ సెంటర్‌కు ఇండోర్ స్పోర్ట్స్ మెటీరియల్‌ను అందజేశారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు.
అనంతరం డీ-అడిక్షన్ సెంటర్ వైద్యులతో ఎస్పీ మాట్లాడి, కేంద్రానికి వచ్చే వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ, కౌన్సెలింగ్ ద్వారా మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన సహకారం, ప్రోత్సాహం అందించి, వారిలో సానుకూల మార్పు తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, నోడల్ ఆఫీసర్, డాక్టర్ మురళీకృష్ణ, సూపరింటెండెంట్, డాక్టర్ రవికుమార్, ఆర్‌ఎంఓ, డాక్టర్ పద్మావతి, ఆర్‌ఎంఓ, ఎస్-నాబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




