Sangareddy: తారా కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!

Sangareddy: సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ ఆజాద్ సేవలను కొనియాడారు.

Srinivas K, Sangareddy
Published on: 11 Nov 2026 11:36 PM IST
Sangareddy
X

Sangareddy: తారా కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం!

సంగారెడ్డి: జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం tara కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలందించారని తెలిపారు. దేశంలో ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు, యూజీసీ ఏర్పాటుకు, విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని వివరించారు. చదువుతోనే ప్రపంచాన్ని మార్చగలమని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వసించారని గుర్తుచేశారు. విద్య వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి చేసిన సేవలను కొనియాడారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy