Sangareddy: సంగారెడ్డి జిల్లాలో నీటిలో మునిగి ముగ్గురు మృతి!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో బట్టలు ఉతకడానికి వెళ్లి నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. తీవ్ర విషాదం.

ALEEM, NARAYANAKHAD
Published on: 9 Oct 2026 3:14 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో నీటిలో మునిగి ముగ్గురు మృతి!

Sangareddy: సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లి నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతులను నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు. గాలింపు చర్యల్లో నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదేహాలను బయటకు తీశారు. నరసింహారెడ్డి భార్య కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

నరసింహారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ జరిగిన సంఘటనను గ్రామస్తులకు చెప్పడంతో అక్కడికి చేరుకొని మృతదేహాలు వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ALEEM, NARAYANAKHAD

ALEEM, NARAYANAKHAD