Sangareddy: మంత్రి వివేక్‌ను కలిసిన సంగారెడ్డి టీఎన్జీవోస్ నూతన బృందం!
Sangareddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరి రవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Sangareddy: మంత్రి వివేక్‌ను కలిసిన సంగారెడ్డి టీఎన్జీవోస్ నూతన బృందం!
సంగారెడ్డి: నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ, జిల్లా కార్యదర్శి వేల్పూరి రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం తరఫున మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని టీఎన్జీవోస్ నాయకులు కోరారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరి రవి పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యత, సంఘటిత శక్తితో ఉద్యోగుల హక్కులను కాపాడటంతో పాటు, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.
టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఉద్యోగుల అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అందరి సహకారం అవసరమని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కోశాధికారి కసిని శ్రీకాంత్, బలరాం, కృష్ణ, సుధామణి ప్రమోద్, యాదవ్ రెడ్డి, గౌస్ హాష్మి, లతా, లావణ్య, సాయి, దత్తు, మీస్కిన్, నాలుగవ తరగతి అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




