Medak: సర్పంచ్ అయినా కులవృత్తి మానలేదు
Medak: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆర్కెల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తన పదవిని, కులవృత్తిని సమానంగా గౌరవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Medak: సర్పంచ్ అయినా కులవృత్తి మానలేదు
Medak: గ్రామానికి ప్రథమ పౌరుడు ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ఆ గ్రామానికి సర్పంచిగా ప్రజలకు సేవలు అందిస్తూనే అతని కులవృత్తి అయిన బేగరి కుల వృత్తి మానలేదు ఆ గ్రామంలో ఎవరు చనిపోయిన అతడు వెళ్లి అంతక్రియలు అయ్యేవరకు పక్కనే ఉంటూ కులవృత్తి అయిన బొందలు తీయడం మానలేదు సర్పంచిగా సేవలందిస్తూనే కులవృత్తి చేస్తున్నాడు.
సంఘటన పాపన్నపేట మండలం ఆర్కెల గ్రామం లో సర్పంచ్ శ్రీనివాస్ చేస్తున్నాడు గత ఎన్నికలలో సర్పంచిగా భారీ మెజార్టీతో గెలిచిన శ్రీనివాస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యే విధంగా పనిచేస్తూనే గ్రామంలో ఏ కులానికి సంబంధించిన మరణించినట్లయితే అతడే వెళ్లి అంతక్రియలు చేస్తూ అ మృతదేహాన్ని దానం చేసే వరకు అతడే అన్ని కార్యక్రమాలు చూస్తాడు. సర్పంచిగా ఎలాంటి అహంకారం. గర్వం లేకుండా సర్పంచ్ గా హోదా గా నిలబడుతూనే కులవృత్తి చేయడంపై గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.




