Patancheru: నందిగామలో పల్స్ పోలియో ప్రారంభం.. చిన్నారులకు చుక్కలు వేసిన నేతలు!

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ విక్రమ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2026 2:20 PM IST
Patancheru
X

Patancheru: నందిగామలో పల్స్ పోలియో ప్రారంభం.. చిన్నారులకు చుక్కలు వేసిన నేతలు!

Patancheru: పటాన్ చెరు దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్ చెరు మండలంలోని నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం,ముఖ్య అతిథిలుగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోరెమియా, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్