Narsapur: గూడూరు దత్తాత్రేయ ఆలయంలో మరోసారి దొంగల బీభత్సం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలం గూడూరు దత్తాత్రేయ ఆలయంలో 12 రోజుల వ్యవధిలో రెండోసారి హుండీ చోరీ జరిగింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 12 Aug 2026 4:32 PM IST
Narsapur
X

Narsapur: గూడూరు దత్తాత్రేయ ఆలయంలో మరోసారి దొంగల బీభత్సం!

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలం గూడూరు గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. గత చోరీ ఘటన జరిగి 12 రోజులు కూడా పూర్తికాకముందే అదే ఆలయంలో మరోసారి హుండీని పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్థులు, భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఒకసారి చోరీ జరిగిన తర్వాత కూడా ఆలయంలో భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే దుండగులు మరోసారి అదే ఆలయాన్ని టార్గెట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలు, దేవాలయాల వద్ద రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

వరుసగా రెండుసార్లు చోరీ జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు చోరీకి పాల్పడిన దుండగులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాలకు భద్రత కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story