Sangareddy: లో-వోల్టేజ్‌తో ఎండిన 300 ఎకరాల పంట.. రైతుల కన్నీటి పర్యంతం!
Sangareddy: దీపం వెలుతురులా కరెంట్ ఎండిపోతున్న 300 ఎకరాల వరి పంట సంగారెడ్డి జిల్లా మేగ్యనాయక్ తండా రైతుల రోదన డీడీలు కట్టి ఏళ్లు గడిచినా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శూన్యం.
Sangareddy: లో-వోల్టేజ్‌తో ఎండిన 300 ఎకరాల పంట.. రైతుల కన్నీటి పర్యంతం!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం, నిజాంపేట్ మండలంలోని, మేగ్య నాయక్ తండా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. విద్యుత్ సరఫరా సరిగా లేక సుమారు 70 మంది రైతుల పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. చేతికొచ్చిన 300ఎకరాలపంట కళ్ళ ముందే ఎండుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం రైతులు విద్యుత్ అధికారులను ఆశ్రయించగా.. డీడీలు తీసుకురండి, అదనంగా మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని విద్యుత్ ఏఈ శ్రుతి హామీ ఇచ్చారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు లేకపోవడంతో రైతుల ఎదురుచూపులు నిరాశగానే మిగిలిపోయాయి.
అర కిలోమీటరు దూరం నుంచి వైర్లు.. దీపం వెలుతురు వలె లో-వోల్టేజ్
గ్రామంలో సరైన ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో రైతులు సుమారు అర కిలోమీటరు దూరం నుంచి విద్యుత్ తీగలు లాక్కొని బోర్లకు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వల్ల తీవ్రమైన లో-వోల్టేజ్ సమస్య ఏర్పడి, కరెంట్ 'దీపం వెలుతురు' మాదిరిగా వస్తోందని రైతులు వాపోయారు. దీనివల్ల బోరు మోటర్లు సరిగా పనిచేయక పొలాలు ఎండిపోతున్నాయి.
పెరిగిపోతున్న అదనపు భారం.. రోజుకు రూ. 10 వేల ఖర్చు
విద్యుత్ సరఫరా లేక, బోర్ల ద్వారా నీరు అందక కొందరు రైతులు జనరేటర్ల సహాయంతో పొలానికి నీరు పారపెడుతున్నారు. ప్రతినిత్యం జనరేటర్ అద్దె రూ. 3,000 మరియు డీజిల్ ఖర్చులు అన్నీ కలుపుకుని రోజుకు సుమారు రూ. 10,000 వరకు ఖర్చవుతోందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఆర్థికంగా తాము ఎంతో నష్టపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
రైతుల ఆవేదన - తక్షణ డిమాండ్లు
మేగ్య నాయక్ తండా శి వర్కు అవసరమయ్యే తక్షణమే నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. ఎండిపోతున్న పొలాలను రక్షించడానికి నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.




