Medak: తూప్రాన్‌లో ఘనంగా శని త్రయోదశి పూజలు

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ పెద్దచెరువు కట్టపై గల శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJU,TOOPRAN
Published on: 13 Jun 2026 3:17 PM IST
Medak
X

Medak: తూప్రాన్‌లో ఘనంగా శని త్రయోదశి పూజలు

Medak: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పెద్దచెరువు కట్ట పైవెలిసినశ్రీవిరాంజనేయస్వామి ఆలయఆవరణలో గల శనిశ్వర ఆలయంలో శని త్రయోదశిశ నివారంసందర్బంగా భక్తల తో సందడి నెలకొంది ఆలయ ధర్మకర్త పూజారి సలకఆత్రేయశర్మప్రత్యేకపూజలునిర్వహించారు

పూజారి ఆత్రేయ శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ. తిథుల్లో వచ్చే త్రయోదశి శనివారంతో కలిసిన రోజునే శని త్రయోదశి లేదా "శనైశ్చర త్రయోదశి" అంటారు. అని ఈ రోజు ఎందుకు ప్రత్యేకం. శనికి ఇష్టమైన రోజు శనివారం శనీశ్వరుడికి, త్రయోదశి తిథి శివుడికి ప్రీతికరం. రెండూ కలిస్తే చాలా శుభం.అని పూజారి తెలిపారు

శని దోష నివారణకోసం జాతకంలో శని దోషం, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు శనివారం శనిశ్వరుడికి పూజ చేస్తే దోషాలు తగ్గుతాయి. కోరికలు తీరుతాయి భక్తితో పూజిస్తే శనిదేవుడు కోరిన కోరికలు తీరుస్తాడనిభక్తులనమ్మకం.తిలాభిషేకం శని దేవాలయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం మంచిది

నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, ఇనుము, నువ్వుల నూనె పేదలకు దానం చేయాలి శివ పూజ త్రయోదశి శివుడికి కూడా ఇష్టం కాబట్టి శివాలయం దర్శనం చేసుకోవాలి ప్రతి నెలా త్రయోదశి వస్తుంది, కానీ అది శనివారంతో కలిసినప్పుడే శని త్రయోదశిగా జరుపుకుంటారని ఆత్రేయ శర్మ పేర్కొన్నారు.

శని పూజా లు ఉదయం 7.8.9.10.గంట లకు గ్రూపులు గ్రూపులు గా అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి మాజీ ఇస్లాంపూర్ సర్పంచ్ నరేందర్ రెడ్డి వెంకట రత్నపూర్ మాజీ సర్పంచ్ వెంకటరం రెడ్డి కౌన్సిలర్ నాగేష్ భ్రమయ్య రవి విజయ్ t భారీగా భక్తులు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN

Next Story