Sangareddy: సింగూరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల.. మంజీరా బ్యారేజీకి చేరిన జలాలు
Sangareddy: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజీలోకి జలాల విడుదల ప్రారంభమైంది.
Sangareddy: సింగూరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల.. మంజీరా బ్యారేజీకి చేరిన జలాలు
Sangareddy: సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు జలమండలి అధికారులు కీలక అడుగు వేశారు. జిల్లాలోని ప్రముఖ నీటి వనరు అయిన సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ లోకి నీటి విడుదల.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ జలమండలి అధికారులు శనివారం సింగూరు ప్రాజెక్టు గేట్లను ఎత్తి, ప్రాథమికంగా 0.1 టీఎంసీల నీటిని దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్ లోకి వదిలారు. ప్రవాహం క్రమంగా మంజీరా బ్యారేజీకి చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు.
Next Story




