Sangareddy: సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సన్మానం

Sangareddy: సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను టీఎన్‌జీఓస్ నేతలు ఘనంగా సత్కరించి, డీఏ, పీఆర్సీ, ఇళ్ల స్థలాలపై వినతిపత్రం సమర్పించారు.

SRIKANTH, SANGAREDY
Published on: 12 Nov 2026 6:47 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సన్మానం

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని సి.ఎస్.ఐ చర్చిలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సంగారెడ్డి జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.ఎన్.జి.ఓస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సంబంధించి వినతిపత్రం సమర్పించారు.

ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డి.ఏ), పీఆర్సీ, జీపీఎఫ్, పింఛనుదారుల సమస్యలు, హాస్టల్ సంక్షేమ అధికారుల సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో ఉద్యోగులకు స్థలాల కేటాయింపు అంశాన్ని కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. జావీద్ అలీ, కార్యదర్శి వి. రవి, అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జి. శ్రీనివాస్, కోశాధికారి కాసిని శ్రీకాంత్, నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షులు షరీఫ్, టౌన్ అధ్యక్షులు యాదవ రెడ్డి వెంకట్, టౌన్ కార్యదర్శి నాగమణి, వార్డు అధికారులు నవీన్, సాయి కిరణ్, రాజు, బిందు, రాధిక, రాజేశ్వరి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY