Jogipet: అందోల్-జోగిపేటలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

Jogipet: అందోల్-జోగిపేట ఇందిరా నగర్ కాలనీలో సత్యసాయి సేవా సమితి, కౌన్సిలర్ కొషికే రాజశేఖర్ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

UMASHANKAR, ANDOLE
Published on: 23 Nov 2026 3:35 PM IST
Jogipet
X

Jogipet: అందోల్-జోగిపేటలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

అందోల్-జోగిపేట: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి సేవా సమితి సభ్యులు మరియు 2వ వార్డు కౌన్సిలర్ కొషికే రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించి సమితి సభ్యులు భజనలు చేశారు. అనంతరం కౌన్సిలర్ కొషికే రాజశేఖర్ చేతుల మీదుగా భక్తులకు, కాలనీవాసులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ... "మానవ సేవే మాధవ సేవ" అనే బాబా సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సత్యసాయి సేవా సమితి చేస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి భక్తులు, కాలనీ పెద్దలు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE