Sangareddy: విశ్వకర్మ జయంతి వేడుకలు..హాజరైన మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారు!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 21 Sept 2026 12:12 PM IST
Sangareddy
X

Sangareddy: విశ్వకర్మ జయంతి వేడుకలు..హాజరైన మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారు!

Sangareddy: తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం 8వ తరం 12వ మఠాధిపతులు శ్రీశ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు, ధర్మపత్ని ఉమాదేవి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మఠాధిపతులకు నిర్వాహకులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వాములవారు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మఠాధిపతులు విశ్వకర్మ భగవాన్ మహత్యం, విశ్వసృష్టిలో ఆయన ప్రాధాన్యత, విశ్వబ్రాహ్మణుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రవచనం చేశారు. భక్తులు విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రతినిధులు, నాయకులు, భక్తులు, విశ్వకర్మ సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR