Medak: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు.. ముగ్గురు అరెస్ట్!

Medak: మెదక్ జిల్లా కూల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి. ముగ్గురు అరెస్ట్, రూ.17,300 నగదు స్వాధీనం.

NAGARAJ, MEDAK
Published on: 13 Oct 2026 10:58 AM IST
Medak
X

Medak: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు.. ముగ్గురు అరెస్ట్!

Medak: కూల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారంతో మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.17,300 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిని కూల్చారం గ్రామానికి చెందిన సత్యనారాయణ, శేఖర్, నర్సింలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ప్రజలు తమ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK