Sangareddy: ఏడీ పోస్టులకు సూపరింటెండెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలి!
Sangareddy: పరిశ్రమల శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించాలని డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
Sangareddy: ఏడీ పోస్టులకు సూపరింటెండెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలి!
సంగారెడ్డి: ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖలోని సూపరింటెండెంట్లు మరియు మినిస్టీరియల్ స్టాఫ్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫోరం ఆధ్వర్యంలో, ఫోరం అధ్యక్షులు మహమ్మద్ జావీద్ అలీ మరియు ప్రధాన కార్యదర్శి వంశీ గార్ల నేతృత్వంలో, శ్రీ J. నిఖిల్ చక్రవర్తి గారు - డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, శ్రీ శ్రీనివాస నాయక్ గారు - అడిషనల్ డైరెక్టర్, శ్రీ K.C.S. బాబు గారు - జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్), హైదరాబాద్ గార్లను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులలో సూపరింటెండెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అర్హులైన IPO లు అందుబాటులో లేకపోవడం, సూపరింటెండెంట్లు 38-39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఏడాది, రెండేళ్లలో రిటైర్మెంట్ కానుండటం, కనీసం 3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారందరికీ ప్రమోషన్ ఇచ్చి న్యాయం చేయాలని కోరడం జరిగింది. దీనికి డైరెక్టర్ గారు, అడిషనల్ డైరెక్టర్ గారు మరియు జాయింట్ డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు మరియు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




