Tellapur: కొల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

Tellapur: తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 11:30 PM IST
Tellapur
X

Tellapur: కొల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

కొల్లూరు: పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత శోభాయాత్ర అంగరంగ వైభవంగా, వేలాది మంది జనసందోహం మధ్య ఘనంగా స్థానిక మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువతతో కలిసి అమ్మవారి ఊరేగింపును అత్యంత కోలాహలంగా నిర్వహించారు.

​అనంతరం మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ మాట్లాడుతూ... గత 20 సంవత్సరాలుగా కొల్లూరు గ్రామంలో విజయదశమి (దసరా) నవరాత్రి ఉత్సవాలను గ్రామ పెద్దలు, ప్రజలు యువకుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారని, భక్తులు విశేష పూజలు నిర్వహించారని పేర్కొన్నారు.

​శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన అమ్మవారి ప్రసాదం వేలం పాట, కోలాటాలు, కళాకారుల నృత్యాలు, ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ శోభాయాత్ర సాగిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో డిస్కో మల్లేష్, ప్రకాష్ గౌడ్ , శంకరయ్య, బాపనపల్లి శ్రీను, బ్యాగరి సురేష్, జంగయ్య,, డ్యాగారి వెంకటేష్, కె. శ్రీనివాస్, మల్లయ్య, గ్రామ పెద్దలు, నవయువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్