Narsapur: నర్సాపూర్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస

Narsapur: నర్సాపూర్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

G Ashok Reddy, Narsapur
Published on: 25 April 2026 3:35 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస

Narsapur: నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కార్యక్రమంగా మారిపోయింది. కార్యక్రమం మొత్తం ఒక్కసారిగా ఉధృతంగా మారింది. అక్కడున్న నాయకులను కార్యకర్తలను సముదాయించడానికి ప్రయత్నించగా మరింత నినాదాలు గట్టిగా చేయడం ఎక్కువైంది.

మంత్రి మాట్లాడేటప్పుడు జై టిఆర్ఎస్ అని నినాదాలు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు. మంత్రి వివేక్ వెంకటస్వామి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం కాలేశ్వరంపై లోటుపాట్లు దానిపై మాట్లాడగా టిఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా జై టిఆర్ఎస్ జై కేసీఆర్ అంటూ నినాదాలు ఇచ్చారు. కెసిఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు అని మంత్రి అనగా ఒక్కసారిగా జై కేసీఆర్ జై బి ఆర్ ఎస్ అని బి ఆర్ఎస్ నేతలు గట్టిగా నినాదాలు ఇచ్చారు.

కాలేశ్వరం పై క్లీన్ చీటీ వచ్చిందని దానిపై మాట్లాడొద్దని మంత్రిని సునీత రెడ్డి కోరగా మంత్రి మాట్లాడడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. సునీత రెడ్డి ని మంత్రి వివేక్ మరియు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ సముదాయించే ప్రయత్నం చేయగా సునీత రెడ్డి వినకపోవడం తో మరింత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story