Dubbaka: మాట ఇచ్చిన 24 గంటల్లోనే చిన్నారులకు షూస్ పంపిణీ!
Dubbaka: మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మాట ఇచ్చిన 24 గంటల్లోనే షూస్ పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న తోట కమలాకర్ రెడ్డి.
Dubbaka: మాట ఇచ్చిన 24 గంటల్లోనే చిన్నారులకు షూస్ పంపిణీ!
Dubbaka: సార్ మాకు షూస్ కావాలి" అని చిన్నారులు అడిగిన 24 గంటల్లోపే షూస్ అందించి మానవత్వం చాటుకున్నారు బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులు తమ గోడును కమలాకర్ రెడ్డి ముందు విన్నవించారు.
మాట ఇచ్చిన వెంటనే స్పందించిన ఆయన శుక్రవారం స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్ ఆధ్వర్యంలో అందరికీ కొత్త షూస్ లను అందజేశారు.ఇక్కడితో ఆగలేదు... షూస్ వేసుకోవడానికి సిగ్గుపడుతున్న విద్యార్థులను చూసి స్వయంగా తానే వారి కాళ్లకు షూస్ తొడిగి ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ "ప్రభుత్వ బడుల పిల్లలు ప్రైవేట్ పిల్లలకు ఏమాత్రం తీసిపోరు. వారికి అన్ని సౌకర్యాలు ఉండాలి. రేపటి సమాజాన్ని నిర్మించేది ఈ చిన్నారులే. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలి" అని పిలుపునిచ్చారు."బడిలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. శక్తివంచన లేకుండా పరిష్కరిస్తా" అని భరోసా ఇచ్చారు.




