Toopran: తూప్రాన్ బ్రాహ్మణపల్లి LC 235 రైల్వే గేటు బంద్!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి LC 235 రైల్వే గేటును మరమ్మతుల నిమిత్తం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

RAJU,TOOPRAN
Published on: 27 Oct 2026 10:54 PM IST
Toopran
X

Toopran: తూప్రాన్ బ్రాహ్మణపల్లి LC 235 రైల్వే గేటు బంద్!

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి LC 235 రైల్వే గేటు మరమ్మత్తు / మార్పిడి పనుల కోసం మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. రేపు అనగా బుధవారం 28 అక్టోబర్ నుండి నవంబర్ 3వ తేదీ వరకు ఈ గేటు వద్ద రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఆరు రోజుల పాటు వాహనదారులు, ప్రజలు LC 234 మరియు LC 236 గేట్ల నుండి రాకపోకలు సాగించాలని సూచించారు. వాహనదారులు గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN