Toopran: తూప్రాన్ అక్షర స్కూల్లో ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు
Toopran: తూప్రాన్ పట్టణంలోని అక్షర స్కూల్లో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు.
Toopran: తూప్రాన్ అక్షర స్కూల్లో ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు
తూప్రాన్: తూప్రాన్ పట్టణంలోని అక్షర స్కూల్ లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లల ఆనందోత్సాహాల నడుమ చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉదయశ్రీ మాట్లాడుతూ... నెహ్రూజీ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమ, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం గురించి తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ కే. శివాని, కరెస్పాండెంట్ నరేష్, డైరెక్టర్ కె. నారాయణ గుప్తా మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.




