Toopran: తూప్రాన్‌లో డబుల్ బెడ్ రూమ్ పట్టా ఉన్నా దక్కని ఇల్లు!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్‌లో బ్లాక్ 29, ఫ్లాట్ G-4 అధికారిక పట్టా ఉన్నా ఇల్లు వేరే వారి కబ్జాలో ఉందని బాధితురాలు మారస్ పద్మావతి ఆవేదన; విచారణకు డిమాండ్.
Toopran: తూప్రాన్‌లో డబుల్ బెడ్ రూమ్ పట్టా ఉన్నా దక్కని ఇల్లు!
తూప్రాన్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తూప్రాన్‌లో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న మారస్ పద్మావతి, భర్త వెంకట్ సుబ్బయ్య కు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను అధికారికంగా మంజూరు చేసింది.
తహశీల్దార్ కార్యాలయం నుంచి జారీ అయిన పట్టా సర్టిఫికెట్ ప్రకారం:
నెం. B1/171/2022
బ్లాక్ నెం. 29 - ఫ్లాట్ నెం. G-4
సర్వే నెం. 325, తూప్రాన్ మున్సిపాలిటీ, మెదక్ జిల్లా
ఈ ఫ్లాట్ పద్మావతి పేరిట కేటాయించబడింది. ఈ పట్టా Non Transferable / Non Alienable అని స్పష్టంగా ఉంది. అంటే ఈ ఇంటిని అమ్మడానికి, బదిలీ చేయడానికి వీల్లేదు.
అయినప్పటికీ తనకు మంజూరైన G-4 ఫ్లాట్‌లో వేరే వారు ఉంటున్నారని, తనకు స్వాధీనం దక్కడం లేదని పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా చేతిలో ఉన్నా ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి తనదని ఆమె వాపోతున్నారు.
తూప్రాన్‌లో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మకాలు చేశారని, దానివల్ల అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు దక్కకుండా ఇతరులు కబ్జాలో ఉన్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టా పత్రం ఉన్న పద్మావతికి వెంటనే తన ఫ్లాట్‌ను అప్పగించాలని, తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో జరిగిన అక్రమ అమ్మకాలు, కబ్జాలపై పూర్తి విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




