Toopran: రావెల్లిలో ఘనంగా సదర్ వేడుకలు.. పాల్గొన్న మహేష్ యాదవ్

Toopran: తూప్రాన్ మున్సిపాలిటీ రావెల్లిలో ఘనంగా యాదవుల సదర్ వేడుకలు; ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నేత బొల్లబోయిన మహేష్ యాదవ్, సంప్రదాయ నృత్యాలు.

RAJU,TOOPRAN
Published on: 23 Nov 2026 10:28 PM IST
Toopran
X

Toopran: రావెల్లిలో ఘనంగా సదర్ వేడుకలు.. పాల్గొన్న మహేష్ యాదవ్

తూప్రాన్: తూప్రాన్ మున్సిపాలిటీలోని రావెల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన యాదవుల సదర్ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లబోయిన మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.

యాదవుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సదర్ అంటేనే యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక. దున్నపోతులతో వీరంగం, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సదర్ వేడుకలు రావెల్లిలో అట్టహాసంగా సాగాయి.

పాల్గొన్న యాదవ సంఘం నాయకులు మరియు యూత్ సభ్యులు:

బొల్లబోయిన వినోద్ యాదవ్, కిరణ్ యాదవ్, కిట్టు యాదవ్, అరుణ్ యాదవ్, అంజి యాదవ్, అనిల్ యాదవ్, బబ్బులు యాదవ్, కర్ణాకర్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, అజయ్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సదర్ వేడుకలను విజయవంతం చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN