Patancheru: తోషిబా యూనియన్ ఎన్నికల్లో ఐదోసారి సీఐటీయూ ఘన విజయం
Patancheru: పటాన్చెరువు తోషిబా పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో 50 ఓట్ల మెజారిటీతో 5వ సారి విజయం సాధించిన సీఐటీయూ. కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన జె. మల్లికార్జున్.
Patancheru: తోషిబా యూనియన్ ఎన్నికల్లో ఐదోసారి సీఐటీయూ ఘన విజయం
పటాన్ చేరు: కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని, కార్మికులను కంటికి రెప్పలా కాపాడేది సీఐటీయూనే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యకులు జె.మల్లిఖార్జును అన్నారు.
పటాన్ చేరు ప్రాంతంలోనీ తోషిబా పరిశ్రమలో ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, బిఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు మల్లేశంలపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులుగా ఐదవ సారి 50 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. గెలుపుతో పరిశ్రమలో కార్మికులు విజయోత్సవ సంబరాలు జరిపారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా మెరుగైన వేతన ఒప్పందాలు, కార్మికులకు సౌకర్యాల సాధన సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల మధ్య అనేక కుట్రలు పని అడ్డదారిలో గెలవాలనుకున్న వారికి ఈ విజయం చెంప పెట్ట లాంటిదని అన్నారు. ఎల్లవేళలా కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల సాధనకు పాటుపడేది ఒక సీఐటీయూ మాత్రమే అన్నారు.
అబద్ధాలే తమ విజయాలుగా చెప్పుకుంటూ కూటమిగా కార్మికుల ముందుకు వచ్చిన కార్మికులు సిఐటియునే విశ్వసించారని తెలిపారు. వరుసగా ఐదవ సారి విజయని అందించిన కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ విజయం కార్మికుల విజయంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో మరిన్ని కార్మిక సంక్షేమ చర్యలకు ముందు ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి వాజిద్ అలీ అనంతరావు శ్రీధర్ అతిమేల మాణిక్, పాండు రంగారెడ్డి, వెంకటేశ్వర్లు శ్రీరాములు బి.ఎస్ రాజు లకాన్ తదితరులు పాల్గొన్నారు.




